Home  »  TV News  »  కనకం కన్నీటి పర్యంతం.. కిచెన్ లో కావ్య చేసిన మొదటి వంట!

Updated : Apr 27, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-80 లో.. కనకం-కృష్ణమూర్తిల కుటుంబాన్ని రాజ్ ఫ్యామిలీ వాళ్ళు అవమానిస్తుండగా.. మధ్యలో ఇందిరాదేవి కల్పించుకొని.. ఎంత శత్రువులైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా అవమానపరచడం ఎప్పుడు జరుగలేదని అంటుంది. ఆ తర్వాత ఇందిరాదేవి ముందుకు కనకం వచ్చి.. మా వల్లనే ఈ ఫంక్షన్ అంతా ఇలా అవడం మాకు చాలా బాధగా ఉందని చెప్పి.. అక్కడ నుండి స్వప్నని తీసుకొని వెళ్ళిపోగా, అప్పు కృష్ణమూర్తిని తీసుకుని వెళ్ళిపోతుంది. వాళ్ళు అలా వెళ్ళడం చూసిన కావ్య బాధపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత కావ్య తన గదిలో బాధపడుతుంది. ఏం తప్పు చేసారని మా నాన్నకి ఇంత అవమానం జరగాలా? నీకు ఈ పూజలెందుకని తన గదిలో ఉన్న కృష్ణుడితో అనుకుంటూ బాధపడుతుంది. మరోవైపు కనకం-కృష్ణమూర్తిల కుటుంబమంతా వాళ్ళింటికి చేరుకుంటారు. అక్కడ స్వప్న వాళ్ళ పెద్దమ్మ.. నా కళ్ళు కప్పి ఆ స్వప్న ఎక్కడికో వెళ్ళిపోయిందని కనకంతో అంటుంది. దాంతో "అది ఎక్కడికి పోలేదు.. ఆ ఫంక్షన్ కి వచ్చి.. మా పరువంతా తీసింది. అప్పటిదాకా మామూలుగానే ఉన్నాం.. ఎప్పుడు అయితే ఇది వచ్చిందో మమ్మల్ని, అందరిని కలిపి తిట్టారు" అని కనకం వాళ్ళ అక్కతో చెప్పి బాధపడుతుంది. ఆ తర్వాత కృష్ణమూర్తి దగ్గరికి స్వప్న వెళ్ళి... నేను చేసింది తప్పే నన్ను క్షమించండని తన పాదాలకు మొక్కుతుండగా.. పక్కకి వెళ్ళిపోతాడు. నా పాదాలు మట్టిని తొక్కేవి.‌ వాటితో మట్టివిగ్రహాలు చేసి వాటికి జీవం పోస్తాను‌‌.. వాటిని నువ్వు తాకితే ఆ విగ్రహాలకు జీవం రాదు.. నిన్ను చూస్తేనే మహాపాపమని కృష్ణమూర్తి అంటాడు.

ఆ తర్వాత స్వప్న తన గదిలోకి వెళ్ళి ఏడుస్తుంటుంది. అప్పుడే స్వప్నకి రాహుల్ కాల్ చేస్తాడు‌. అక్కడ మీ వాళ్ళంతా నన్ను అవమానిస్తుంటే.. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవా అని స్వప్న అడిగేసరికి.. నేను ఇంటికి రావొద్దని చెప్పాను కదా.. నాకు కొంచెం టైం కావాలని రాహుల్ అనగా.. ఇదే చివరి అవకాశమని కాల్ కట్ చేస్తుందిమరోవైపు కళ్యాణ్ అప్పుకి కాల్ చేసి కలుద్దామని చెప్తాడు. ఇద్దరు ఒక దగ్గర కలుసుకొని.. మా రాజ్ అన్నయ్య కావ్యని తప్పు చేసిందని నిరూపించి, తనని ఇంట్లో నుంచి పంపాలని చూస్తున్నాడు.. మీ స్వప్న అక్క వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకునే ఐడియా ఒకటి ఉందని అప్పుతో చెప్తాడు కళ్యాణ్. మరోవైపు వంటగదిలో ధాన్యలక్ష్మి ఒక్కతే వంటచేస్తుంది. తనని చూసిన ఇందిరాదేవి.. ఏంటి ధాన్యలక్ష్మి ఒక్కదానివే వంటచేస్తున్నావని అడుగగా.. పనిమనిషి శాంత రాలేదని చెప్తుంది. దాంతో ఇందిరాదేవి కావ్య దగ్గరకి వెళ్ళి.. కిచెన్ లోకి వెళ్లి కమ్మని వంట చేయమని చెప్తుంది. సరేనని కావ్య వంటగదిలోకి వెళ్ళి.. ధాన్యలక్ష్మిని కూర్చోమని తనే వంట మొత్తం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.